పర్యావరణ పరిరక్షణ కోసం
మట్టి వినాయకుల ప్రతిమలనే ప్రతిష్ఠించాలని ప్రజల్లో చైతన్యం కోసం వరంగల్
విద్యార్థి బోడ వినోద్ కుమార్ సైకిల్‌యాత్ర చేస్తున్నాడు. వరంగల్‌లోని
వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న వినోద్
సెప్టెంబర్1న సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్,
రసాయనాలతో తయారైన వినాయక ప్రతిమలు పర్యావరణానికి ఏ విధమైన హాని తలపెడతాయో
ఊరూరా వివరిస్తూ.. మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని ప్రచారం
నిర్వహిస్తున్నాడు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్,
రంగారెడ్డి జిలాల్లో సైకిల్ యాత్రను పూర్తి చేసుకుని సోమవారం భువనగిరికి
చేరుకున్నాడు. పర్యావరణం కోసం విద్యార్థి చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు
అభినందిస్తున్నారు.
No comments:
Post a Comment